కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సు పై పునరాలోచించాలి: పొన్నం

హైదరాబాద్‌: ఈ  నెల 23న జరిగే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సుపై అధిష్ఠానం పునరాలోచించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలో వేర్వురుగా సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఒకే సదస్సు నిర్వహిస్తే తెలంగాణ, సీమాంధ్రుల మధ్య వైషమాల్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో పార్టీ ఓడిపోతుంటే సమీక్షించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలను ప్రశ్నించారు.