కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పాట్లు: ఎంపీ నామా

ఖమ్మం: కాంగ్రెస్‌ పాలనలో రైతులు నానా పాట్లు పడుతున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ రోజు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు లాఠీదెబ్బలు తినాల్సివస్తోందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.