కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు చేసిందేమిటో చెప్పాలి: యనమల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్‌ పార్టీకానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కానీ బీసీలకు ఏమీ చేయలేదన్నారు. బీసీల మనోభావాలు దెబ్బతినేలా సాక్షి పత్రిక కథనాలు రాస్తోందని ఆయన ఆరోపించారు. వైఎస్‌ కేటాయించిన ఎన్‌ఈజెడ్‌లలో నష్టపోయింది బీసీలేనని, రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మత్య్సకారులను వృతికి దూరం చేసిందని యనమల ఆరోపించారు. తెదేపా హయాంలో ఆదరణ పథకం మొదలైందని, రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం దాన్ని నిలిపి వేసిందని యనమల ఆరోపించారు.