కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షులను కలిసిన కొట్టం మనోహర్.
కోటగిరి సెప్టెంబర్ 22 జనం సాక్షి:-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ గురువారం రోజున హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డినీ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.బాన్సువాడ నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలు,సమస్యలు అలాగే పలు అంశాలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో కలిసి చర్చించారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీలో మొత్తం 119 నియోజక వర్గలలో 238 మందిని నియమించి,అందులో బాన్సువాడ నియోజక వర్గం నుండి టీపీసీసీ సభ్యులుగా కాసుల బాలరాజ్,మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డిలను నియమించినందుకు టి.పి.సి.సి అద్యక్షులు రేవంత్ రెడ్డికి కొట్టం మనోహర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.