కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం..

share on facebook

– కాంగ్రెస్ బలోపేతం ఆయన లక్ష్యం.
– మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.
ఊరుకొండ, డిసెంబర్ 12 (జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై జడ్చర్ల నియోజకవర్గానికి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్ ను సోమవారం మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డితో పాటు ఊరుకొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఎర్ర శేఖర్ గారికి టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమించడం అభినందనీయం అన్నారు. శివప్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మనోహర్ రెడ్డి, అషూ, మల్లికార్జున్, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.