కాకతీయ సేవాసమితిలో వనభోజనాలు
నిజాంపేట : హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన కమ్మ సోదరుల వన భోజన మహోత్సవాలు నిజాంపేట కాకతీయ సేవా సమితిలో అదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఉరవకోండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అనాదిగా కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అదర్శంగా నిలుస్తూ వచ్చారని ఇదీ స్పూర్తిని నేటి యువత కోనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా మహిళా అధ్యక్షురాలు జి. శ్యామల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గోన్నారు.



