కాగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై గడ్కరీ కేసు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ సోమవారం క్రిమినల్‌ పరవు నష్టం కేసు వేశారు. బొగ్గుగనుల కేటాయింపుల్లో రూ.500 కోటల్ల మేరకు స్వాహా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ అజయ్‌ సంచేటితో నితిన్‌గడ్కరీకి వ్యాపార సంబంధాలున్నాయంటూ దిగ్విజయ్‌సింగ్‌ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది.