కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు: సీఎం

శ్రీకాకుళం: కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో సీఎం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో సదుపాయాలు, ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ గృహలను సమూలంగా మార్చనున్నామని చెప్పారు.