కార్మికుల, రైతుల హక్కులను  కాలరాయడమే  మోడీ ధ్యేయం – సి ఐ టి యు

కార్మికుల, రైతుల హక్కులను  కాలరాయడమే  మోడీ ధ్యేయం – సి ఐ టి యుపెనుబల్లి, మార్చ్ 31(జనం సాక్షి)దేశంలో కార్మికుల, రైతుల హక్కులను హరించేందుకే మోదీ ప్రధానిగా సాగుతున్నారని, దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని  సిఐటియు  జిల్లా కార్యదర్శి  కళ్యాణం వెంకటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం విఎం బంజర్ రింగ్ సెంటర్లో కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన  సమావేశంలోఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కారు చౌకకె  కార్పొరేట్లకు అప్పగించి దేశ సంపదను దోచిపెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు  దేశవ్యాప్త సమ్మెలకు పిలుపునిచ్చినా  ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం మెడలు వచ్చేందుకే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలి అన్నారు, గతంలో రైతులు నిర్వహించిన   పోరాటానికి ప్రభుత్వం  నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని రైతులకు క్షమాపణ చెప్పి తిరిగి దొడ్డిదారినే ఆ చట్టాలను  అమలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు, సిఐటి యు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు,  రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు , చలమాల నరసింహారావు, గాయం తిరుపతిరావు  మిద్దె స్వామి, అన్నపురెడ్డిపల్లి లక్ష్మయ్య, చీ పి వెంకటేశ్వరరావు,  తాండ్ర రాజేశ్వర రావు పాల్గొన్నారు.