కాల్‌లెటర్‌ ఆలస్యంతో నిరుద్యోగి విలవిల

ఖమ్మం, జూలై 7 : సకాలంలో అందాల్సిన కాల్‌లెటర్‌ అందకపోవడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని ఒక నిరుద్యోగ యువకుడు కె.రవి వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని మొలకలపల్లి మండలంలోని పూసుగూడెం పంచాయితీ పాటూరుకి చెందిన తాను, స్టాప్‌ సెలక్షన్‌ కమిషన్‌ సిఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రాతపరీక్షలకు హాజరయ్యాడు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో జూలై రెండున హైదరాబాద్‌లోని హకీంపేటలో జరిగే మెడికల్‌ పరీక్షకు హాజరు కావాలని సూచిస్తూ అధికారులు కాల్‌లెటర్‌ పంపారు. కాల్‌లెటర్‌ను రవికి జూలై ఐదన పూసుగూడెం తపాలా సిబ్బంది అందజేశాడు. నిరుద్యోగ యువకుడు రవి వైద్య పరీక్షకు హాజరుకాలేకపోయాడు. తపాలశాఖ నిర్లక్ష్యం కారణంగా మెడికల్‌ పరీక్షకు హాజరు కాలేకపోయానని ఆ పరీక్షకు హాజరైతే కానిస్టేబుల్‌ ఉద్యోగం తనకు వచ్చేదని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.