కాల్‌ డేటా కేసులో ఒకరి అరెస్టు

హైదరాబాద్‌: సీబీఐ జైడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా కేసులో కె.వెంకటరెడ్డి అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఇందు భరత్‌ ఎనర్జీ వైన్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రేపు నాంపల్లి కోర్టులో ఇతన్ని హాజరుపరచున్నట్లు చెప్పారు.