కాళేశ్వరి బస్సు ప్రమాదంలో డ్రైవరు మృతి

హైదరాబాద్‌: కాళేశ్వరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో గాయపడిన ఆ బస్సు డ్రైవరు శేషుబాబు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రోజున మరో డ్రైవరు బస్సు నడుపుతుండగా శేషుబాబు నిద్రపోతున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని మహరాష్ట్రలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. విజయవాడకు చెందిన ఇతను నాలుగు సంవత్సరాలుగా ట్రావెల్స్‌లో డ్రైవరుగా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం నిమ్స్‌కు తరలించాలని చెప్పిన అధికారులు ఆ తరువాత ఉస్మానియాకి తరలించినట్లు బందువులు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం అంరకపోవడం వల్లే శేషుబాబు మృతి చెందాడని వారు ఆరోపించారు