కావేరి నది అధారిటీ సమావేశం

న్యూఢిల్లీ : తమిళనాడులోని పంటలను కాపాడేందుకు కావేరి జలాలివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేసిన డిమాండ్‌పై కేంద్రం స్పందించింది. ఈ నెలాఖరులో కావేరి నది ఆధావిటీ సమావేశం ఏర్పాటుచేయునున్నట్టు కేంద్రం జలవనరుల శాఖమంత్రి పవన్‌కుమార్‌ జన్సల్‌ తెలిపారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన ఈ నెల 19 లేక 20 వ తేదీన సమావేశం జరుగనుందని ఆయన వెల్లడించారు.