కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతోంది: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. లోయలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాశ్మీరులో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న నమ్మకం కుదిరింది. అని ప్రణబ్ శ్రీనగర్ నుంచి తిరుగు ప్రయణం సందర్భంగా శుక్రవారం భారత వైమానికదళ ప్రత్యేక విమానంలో విలేకర్లతో చెప్పారు. గురువారం శ్రీనగర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో తన చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకొన్న వారిలో 85 శాతం మంది విద్యార్థినులే ఉండడం సంతోషకరమన్నారు.



