కింగ్‌కోఠిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : కింగ్‌కోఠి ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ గోదాములో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా గోదాములో ఉన్న ఫర్నిచర్‌, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.