కీసరలో నేటినుంచి బ్ర¬్మత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

మేడ్చల్‌,మార్చి1(జ‌నంసాక్షి): మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలకు కీసరగుట్ట దేవస్థానం ముస్తాబయింది.2వ తేదీ నుంచి 7వరకు కీసరగుట్ట బ్ర¬్మత్సవాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతర బ్ర¬్మత్సవాలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్‌ ఎం.వీ.రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. 2వ తేదీ నుంచి 7వరకు నిర్వహించే కీసరగుట్ట బ్ర¬్మత్సవాలకు విచ్చేసే భక్తులకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జాతరను పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ 22 జాతర కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో జాతర పర్యవేక్షణ పనులు పూర్తిచేశారు. జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే రెండుసార్లు జిల్లా సంబంధిత అధికారులతో జాతర సవిూక్ష సమావేశాలను నిర్వహించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు గుట్టలోనే అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సుమారు 7 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి రెండు ధర్మదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని కీసరగుట్ట చైర్మన్‌ తటాకం నారాయణశర్మ తెలిపారు.స్వామి దర్శనం కోసం రూ. 200, 400, 800 టిక్కెట్ల క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వీవీఐపీ (ప్రొటోకాల్‌) క్యూలైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం, కీసర రింగ్‌ రోడ్డు నుంచి గుట్ట వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ నియంత్రణ, శానిటేషన్‌, శాంతి భద్రతల పరిరక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా సీసీ కెమెరాల నిఘాతో ఉంటుందని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ తెలిపారు. కీసరగుట్టకు వచ్చే మార్గం నుంచి పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. షీటీమ్స్‌, ఎస్‌ఓటీ టీమ్‌లు పర్యవేక్షిస్తాయని, మహిళా భక్తుల కోసం క్యూలైన్ల వద్ద మహిళా పోలీసులను నియమించ నున్నారు. క్యూలైన్లో స్వామివారిని ఒకేసారి నలుగురు భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాజావార్తలు