కుంభమేళా స్నానఘట్టాల వద్ద ఫోటోలపై నిషేధం
అలహాబాద్: కుంభమేళా జరుగుతున్న ప్రాంతాంలోని స్నానఘట్టాల వద్ద ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుంభమేళా నిర్వహణ సంఘం తెలిపింది. స్నానఘట్టాల వద్ద ఫోటోలు తీయడానికి ఎవరిని అనుమతించవద్దంటూ కుంభమేళా భద్రతను పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు, ఫోటో జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో కుంభమేళా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.