కుక్కల కోసం జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్..

 5rnpeeptహైదరాబాద్ : వీధి కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో కుక్కకాటు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో కుక్కల స్వైరవిహారం చేయడంతో జీహెచ్ఎంసీ మేల్కోంది. వెంటనే నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. రేబిస్ రాకుండా కుక్కలకు టీకాలు, సంతానోత్పత్తి నివారించడానికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వేసవిలో కుక్కలకు చిన్నారులను దూరంగా ఉంచేటట్లు చూడాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.