కుటుంబకలహాలతో అన్న, తమ్ముడు ఆత్మహత్య

మిరుదొడ్డి: మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్‌లోని ఓ కుటుంబంలో అన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.