కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య
పూతలపట్టు : చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని రుణంవారిపల్లె గ్రామంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్న బాలకృష్ణమనాయుడు (51), భార్య కళావతి (45)తో కలిసి ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.