కుప్పకూలిన భారత టాప్ ఆర్డర్
చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత టాప్ అర్డర్ కుప్పకూలింది. పాక్ బౌలర్ల ధాటికి ఒక్కొక్కురుగా చేతులెత్తేస్తూ పెవిలియన్ దారి పట్టడంతో భారత్ ఆరు ఓవర్లు ముడిసేసరికి 29 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. పాక్ బౌలర్ జునైద్ ఖాన్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. ఐదుగురిలో నలుగురు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. రోహిత్ శర్మ(4), యువరాజ్ (2), కోహ్లీ(0), సెహ్వాగ్(4) జునైద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట్‌కాగా .. గంభీర్ (8) ఇర్ఫాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.