కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గత నెలరోజులుగా ఇక్కడి మెట్రో సమీపంలో ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది.ఈ ఉదయం మన్సిపల్‌ సిబ్బంది చెత్త తగలబెడుతుండగా మంటలు వ్యాపించి ఎగ్జిబిషన్‌లోని 90 స్టాళ్లు,3 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు.అగ్నిమాపకలు 5 వచ్చాయి.ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు.ఫైర్‌ రీజినల్‌ ఆఫీసర్‌ జీవీ నారాయణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హుటాహుటిన మంటలను ఆర్పి వేయంచారు. ఎగ్జిబిషన్‌ నిర్వహకులు అగ్ని ప్రమాదాల నివారణకు సరైన ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు తెలియజేస్తున్నారు.