కూచన్ పల్లి చెక్ డ్యామ్ లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

share on facebook

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మత్స్య సంపద పెంపకం లో భాగంగా హావేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి చెక్ డ్యామ్ లో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమం జిల్లా ఫిషరీస్ అధికారి రజనీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హావేలి ఘనపూర్ మండల అధ్యక్షుడు శేరి నారాయణ రెడ్డి, సర్పంచులు మన్నె లక్ష్మీ నారాయణ, యామి రెడ్డి, శ్రీను నాయక్, టీఆర్ఎస్ నాయకులు గోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి,తదితర నాయకులు, మత్స్య సంఘాల నాయకులు, ఫిషరీస్ శాఖ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ కూచన్ పల్లి-ముత్తాయిపల్లి శివారులో చెక్ డ్యామ్ లో చేప పిల్లలను వదలడం జరిగిందని, గతంలో ఇదే మంజీర నదిలో చుక్క నీరు ఉండేది కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజీరపై షేక్ హాండ్ చెక్ డ్యాం లు నిర్మించడం మరియు ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంత గ్రామీణ ముదిరాజ్, గంగ పుత్ర కులస్తులు చేపల పెంపకంతో అభివృద్ధి చెంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయిందని ఎమ్మెల్సీ గారు తెలిపారు. ఈ ప్రాంతంలో రొయ్యల పెంపకం కూడా జరిగే విధంగా మత్స్య శాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్సీ గారు కోరారు. ఎవరైనా ప్రైవేట్ ఫిష్ పాండ్స్ పెట్టుకునే విధంగా ప్రోత్సహించాలని, ఈ ప్రాంతంలో నీటి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి యువత ఈ రంగంలో ఉపాధిని ఎంచుకోవాలని ఎమ్మెల్సీ గారు పేర్కొన్నారు.

Other News

Comments are closed.