కృష్ణమూర్తి 7వ వర్థంతి సభ

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, వ్యవసాయ కార్మిక సంఘం నేత కె. కృష్ణమూర్తి వర్థంతి సభను హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు. సందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ, ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి  చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన గొప్ప ఉద్యమ నేత అని సభలో వక్తలు కొనియాడారు. పేదలకు వెంటనే భూపంపిణీ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ బాధ్యతను విస్మరిస్తే పేదలే భూములు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.