కెసిఆర్ ఓ మంచి నీటి ప్రయత్నం
డిపాజిట్లు తగ్గించడంతో ప్రజలకు ఊరట
నీటి సమస్యకు దక్కనున్న శాశ్వత పరిష్కారం
హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల ముందు మంచినీటికి సంబంధించి సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం పేదలకు వరం కానుంది. తక్కువ ఖర్చుతో నీటి కనెక్షన్ పొందాలన్న కల నెరవేరనుంది.
రానున్న వేసవిలోగా దీనిని పూర్తి చేస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఇంటికి నల్లా కనెక్షన్ పొందేందుకు రూ.6000 డిపాజిట్ తీసుకుంటున్నారు. ఇంటి లోపలికి నల్లా పెట్టు కోవాలంటే రూ.10,500 చెల్లించాల్సి వస్తున్నది. డిపాజిట్ రుసుము ఇంత పెద్ద మొత్తంలో ఉండటం వల్ల పట్టణ ప్రాంతా ల్లో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందుకే మిషన్ భగీరథ ద్వారా అన్నిగ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లాల ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్నది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే, డిపాజిట్‌ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లాల కనెక్షన్ డిపాజిట్‌ను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వరంగా మారనుంది. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, మిషన్ భగీరథ ద్వారా అందే శుద్ధిచేసిన నీటిని తాగాలని సిఎం కోరుకుంటున్నారు. టిఆర్‌ఎస్ పార్టీకి ప్రస్తుత రాజకీయ వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకొచ్చిన పథకాల పట్ల రాష్ట్ర ప్రజల్లో చాలా సానుకూలత వ్యక్తమవుతోంది.ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం పెంచాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. అనుకున్న సమయంలోగా వాటిని పూర్తి చేసేలా పనిచేయాలని అన్నారు. ఈ దశలో మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షితమైన మంచినీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోంది. అందరూ కనెక్షన్ పొందాలంటే ధరావతును నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే శుద్ధిచేసిన నీటిని అందరూ తాగాలని కోరుకుంటున్నానని సిఎం కెసిఆర్ ప్రకటించారు. పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ రాజకీయ వాతావరణాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు వ్యక్తిగతంగా కూడా అనుకూలంగా మార్చుకోవాలి. కార్యకర్తలకు, ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్‌ను సరి చేసుకోవాలి. పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అందరికీ అందేలా కృషి చేయాల్సి ఉంది. రైతుబందు తరవాత పరిస్థితులు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని మొన్నటి అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ దశలో ఇచ్చిన హావిూ మేరకు ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా ప్రతి రైతుకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలలో వేగం పెంచారు. ఈ రాజకీయ అనుకూల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రజల్లో పూర్తి సానుకూలత సాధించాలన్న భావనలో సిఎం కెసిఆర్ ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పండించిన పంటలకు మద్దతు ధర లభించేలా రైతు సమన్వయసమితిల ద్వారా కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.


