కేంద్రం సామాన్యుల గోడు మాత్రం పట్టించుకోవటం లేదు : ఎర్రన్నాయుడు
విజయవాడ: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు రిటైల్ వ్యాపారంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చిందని తెదేపా ఆరోపించింది. అయితే అవి పేద ప్రజలకు ఉపయోగపడేలా మానవీయకోణంలో ఉండాలని ఈ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు విజయవాడలో అన్నారు. యూపీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఏమాత్రం మానవీయత లేదని, అందుకే వాటిని దేశంలోని అన్ని పక్షాలు వ్యతికేకిస్తున్నాయన్నారు. విదేశీ సంస్థలకు తలుపుబార్లా తెరుస్తున్న కేంద్రం సామాన్యుల గోడు మాత్రం పట్టించుకోవటం లేదని ఆక్షేపించారు.