కేంద్రమంత్రి వెంకయ్యతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 జనంసాక్షి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ బుధవారం ఉదయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. డిల్లీ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా వెంకయ్యకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.