కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి

 హుజూర్ నగర్ మార్చి 4 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని, తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నియోజవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ రేట్లు పెంచినందుకు టిఆర్ఎస్ కె.వి కార్మిక విభాగం అమాలీ రంగం శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నియోజవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ మాట్లాడుతూ పేదవారికి రోజువారి కూలీ చేసుకుంటేనే జీవన గడుస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న గ్యాస్ మొయ్యలేని ధర వల్ల కూలీలు గ్యాస్ కొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఉజ్వల గ్యాస్ కలెక్షన్ ఇచ్చే అవసరం గ్యాస్ ధరలు పెంచి పేదవాడి నడ్డి ఇరగొడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేదా 5 కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తూ, సామాన్య కార్మికున్ని జీవనాన్ని నరకంలో తోస్తున్నారని, తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలని హుజూర్ నగర్ నియోజకవర్గం కార్మికులు డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ అధ్యక్షులు బాలకృష్ణ, సలహాదారులు ముసంగీ శీను, కారంగుల నరసింహారావు, ఆకుల వెంకన్న, జక్కుల లింగయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.