కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ స్థానంలో ఇప్పటి వరకు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పి.చిదంబరంకు ఆర్థికశాఖ అప్పగించారు. చిదంబరంలో స్థానంలో హోం శాఖను సుశీల్‌కుమార్ షిండేకే కేటాయించారు. షిండే నిర్వహిస్తున్న విద్యుత్తు శాఖ బాధ్యతల్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి వీరప్పమొయిలీకి అదనంగా అప్పగించారు.