కేంద్ర మాజీ మంత్రి రాందాస్‌కు వారెంట్‌

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌పై ఢిల్లీ న్యాయస్థానం శనివారం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా సమన్లు అందుకోకుండా, న్యాయస్థానం ముందు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారంటూ ఈ వారెంటు జారీ చేసింది. సరిపడా అధ్యాపకులు, సరైన మౌలిక వసతులు లేకుండానే ఇండోర్‌కు చెందిన ఇండెక్స్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు చట్టవిరుద్ధంగా అనుమతి మంజూరు చేశారని మంత్రిపై అభియోగాలు నమోదయ్యాయి. రామ్‌దాస్‌కు కోర్టు జారీ చేసిన సమన్లు అందజేయకపోవడం పట్ల ఇచ్చిన వివరణ కూడా సంతృప్తి కరంగా లేదని, తదుపరి విచారణ సమయంలో సంబంధిత పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి తల్వంత్‌సింగ్‌ ఆదేశించారు.