కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

akshaహైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : కేజ్రీవాల్‌ నాయకత్వానికే దిల్లీ ప్రజలు పట్టం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు సంప్రదాయ రాజకీయాల మార్పునకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ దిల్లీ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.