కేబినెట్‌ కమిటీల సమావేశాలు రద్దు

న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం జరగాల్సిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఆకస్మికంగా రద్దయింది. వీటి రద్దుకు అధికారులు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ఈ సమావేశాలన్నీ ప్రధాని మన్మోహన్‌ అధ్యక్షతనే జరుగుతాయి. ప్రధాని స్వల్ప అస్వస్థతకు గురికావటం వల్లే ఈ సమావేశాలు రద్దయ్యాయని భావిస్తున్నారు.