కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

 

గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి

శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 23:
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని హస్నాబాద్ శాసనసభ్యులు వి.సతీష్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల కేంద్రంలో యంజి .ఎన్.ఆర్.ఇ.జి.ఎస్,నిధులు 16 లక్షలు, జిపీ నిధులు 15లక్షల మొత్తం 31 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ , అడిషనల్ కలెక్టర్ ఘరిమా అగర్వాల్ మంగళవారం ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మరుగు దొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రతి గ్రామ అభివృద్ధికి నెల నెల ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని,స్వరాష్టం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యం గా సాగుతున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి ని సాధిస్తున్నాయని, నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో వెనుకబాటుకు గురయ్యామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని, ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ గికురు రవీందర్,పాక్స్ చైర్మన్ జంగ వెంకట రమణ రెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.