కేసీఆర్‌కు మన్మోహన్‌, శరద్‌పవార్‌ అభినందనలు

న్యూఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో కేసీఆర్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ పేరును యూపీఏ ఖరారు చేసిన చేసిన నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతు కూడగడ్డంలో భాగంగా కేసీఆర్‌ మద్దతును కూడా మన్మోన్‌సింగ్‌ ఈ సందర్భంగా కోరినట్టు సమాచారం.
అలాగే కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ఈరోజు సాయంత్రం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి పరకాల విజయంపై అభిందనలు తెలిపారు.గ్రెస్‌ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.