కేసీఆర్‌తో మాజీ మంత్రి కోమటిరెడ్డి భేటీ

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలో మాజీ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి ఆజాద్‌ వ్యాఖ్యల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధన్యత సంతరించుకుంది. తెలంగాణపై నిర్ణయానికి కేంద్రానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో తదనంతర పరిణామాలపై కేసీఆర్‌తో కోమటిరెడ్డి చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.