కేసీఆర్‌ సర్కార్‌ది మాటల ప్రభుత్వం: ఉత్తమ్‌

నల్లగొండ: కేసీఆర్‌ ప్రభుత్వం మాటలకే తప్ప చేతల సర్కార్‌ కాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఇక నల్లడబ్బును దేశానికి తెప్పించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఉత్తమ్‌ విమర్శించారు.