కేసీఆర్-ఏకే ఖాన్ భేటీ : రేవంత్ రెడ్డి ఏం చేస్తారో? బెయిల్ వస్తుందా?

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఏకేఖాన్-కేసీఆర్‌ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి కేసులో విచారణ నిమిత్తం రేవంత్‌తో పాటు తదితర నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఏసీబీ కోరనుంది. దానికి సంబంధించి మాట్లాడేందుకే కేసీఆర్‌ను కలసినట్టు సమాచారం. అంతేగాక శుక్రవారం రేవంత్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైన కేసీఆర్‌తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డిపై కక్ష్య తీర్చేందుకే కేసీఆర్ ఏకే ఖాన్‌తో భేటీ అయ్యారని… తన ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డిని అదుపు చేసేందుకే పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి అరెస్ట్ చేయించారని, రేవంతన్న ఎపిసోడ్‌కి డైరక్షన్ కేసీఆరేనని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.