కొండచరియలు విరిగిపడి మహిళ సజీవసమాధి

ఉత్తరాఖండ్‌ : రిషికేష్‌, బద్రీనాధ్‌ జాతీయ రహదారిపైన కొండచరియలు విరిగిపడి ఒక మాహిళ సజీవసమాధి కాగా 15 మంది గాయపడ్డారు. చమోలీ జిల్లాలో అగకుండా కురుస్తున్న వర్షాల వల్ల తరుచూ కొండచరియలు విరిగిపడుతున్నాయాని అధికారులు చెప్పారు. వర్ష కారణంగా సహాయక చర్యలు చేపట్టడమూ కష్టమవుతుందని వారు అంటున్నారు.