కొండపల్లి గ్రామ వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ జర్నలిస్ట్ రాఘవ బంగారు
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 31 : గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ జర్నలిస్ట్ రాఘవ బంగారు పాల్గొన్నారు.
కొండపల్లి గ్రామంలోని శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన విఘ్ననాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జర్నలిస్ట్ రాఘవ బంగారు దంపతులు
ఈ సందర్బంగా కొండపల్లి గ్రామ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
కులాల, మతాలకు అతీతంగా కొలిచే దైవం వినాయకుడని రాఘవ బంగారు అన్నారు. ఏ మంచి పనిచేయాలన్నా.. వినాయకుడి పూజ తర్వాతే మొదలుపెడతామన్నారు. గ్రామంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలను నిర్వాకులు జాగ్రత్తగా నిర్వహించుకోవాలని ప్రతి గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అందులో నిర్వాహకుల పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జనం రోజున ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు సహకరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా చూడాలని కోరారు,ప్రతి ఒక్క మతాన్ని ,మత విశ్వాసాన్ని గౌరవించాలన్నారు.
కార్యక్రమంలో జర్నలిస్టు రాఘవ బంగారు, నల్లన్న దంపతులతో పాటు మురళి,రంగస్వామి,శివ,మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.