కొండా లక్ష్మణ్‌ బాపూజీ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్‌, 27, 1915లో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్‌బాపూజీ జన్మించారు. 1952లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గోన్నారు. తెలంగాణ సాధన సమితి సభ్యునిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1969లో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం కారణాంగా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం  నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు. హైదరాబాద్‌లో అఖిలభారత పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేశారు.