కొండా సురేఖపై కేసు నమోదు

కొండా సురేఖ

వరంగల్‌ :  పరకాల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సురేఖ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాల్లో ఐదు వందల రూపాయల నోట్లు పెట్టి పంచుతుండగా ఓ టీవీ కెమెరాకు చిక్కిన చిక్కారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ ఆధారంగా సురేఖపై కేసునమోదు చేసినట్లు తెలుస్తోంది.