కొండా సురేఖ మతి భ్రమించింది : కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో కొండా సురేఖ ఒక కలుపుమొక్క అని ఆమెకు మతి భ్రమించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. పాదయాత్రల పేరుతో వైఎస్సార్‌సీపీ తెలంగాణలో రాయలసీమ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ సాధించడమే టీఆర్‌ఎస్ లక్ష్యమని చెప్పారు.