కొడాలి నాని విమర్శలను తిప్పికొట్టిన తెదేపా

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన విమర్శలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న నాని తనకు రెండు సార్లు టికెట్‌ ఇచ్చి గెలిపించినందుకు క్షమాపణలు చెప్పాలా అని ప్రశ్నించారు. ఒక రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా ప్రజల్లో గౌరవం ఇప్పించినందుకు పార్టీ క్షమాపణలు చెప్పాలా అని ఆయన నిలదీశారు. దొంగల పార్టీలో చేరి జైలులో కాపురం ఉండడానికే కొడాలి నాని అక్కడికి వెళ్లున్నారని ఆయన చెప్పాడు.