కొత్త ఎక్సైజ్‌ పాలసీ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ విధానం అమలు కానున్నది. కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ నూతన ఎక్సైజ్‌ విధానం మేరకు 10వేల జనాభా గల ప్రాంతంలో ఎక్సైజ్‌ ఫీజు 32 లక్షలు, 10 వేల నుంచి 50వేల జనాభా గల ప్రాంతంలో 34 లక్షల రూపాయలు, 50వేల నుంచి మూడు లక్షల జనాభా గల ప్రాంతంలో 42 లక్షల రూపాయలు, మూడు లక్షల నుంచి ఐదు లక్షల జనాభా గల ప్రాంతంలో 46 లక్షల రూపాయుల, ఐదు లక్షల నుంచి 20 లక్షల జనాభాగల ప్రాంతంలో 64 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభాగల ప్రాంతంలో కోటి నాలుగు లక్షల రూపాయల ఎక్సైజ్‌ ఫీజు వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 6596 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మద్యాన్ని ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఎవరైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే ఆ మద్యం షాపు లెసెన్స్‌ రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. నిబంధనలు పాటించని మద్యం షాపులను వెనక్కి తీసుకుని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహిస్తుంది.