కొత్త కార్పోరేటర్లకు రెండు నెలల ఎదురుచూపు
ఫిబ్రవరి 10 వరకు వేచిచూడక తప్పని స్థితి
హైదరాబాద్,డిసెంబరు5 (జనంసాక్షి) : ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక వర్గానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉంది. సాధారణంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించినా పాత పాలకవర్గం పదవీ కాలం పూర్తయ్యే వరకు కొత్త వారు పదవీ బాధ్యతలు తీసుకునేందుకు అవకాశం లేదు. దీంతో కొత్త కార్పొరేటర్లు ఫిబ్రవరి 11వ తేదీ తర్వాతే బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ముదంస్తు ఎన్‌ఇనకల ఫలితం బాగా కలసి వచ్చినా ..అదే వ్యూమం గ్రేటర్‌లో మా/-తరం బెడిసి కొట్టింది. ముందస్తు వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాన్ని చవిచూసింది. గ్రేటర్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తుది ఫలితం మినహా అనేక విషయాల్లో సారూప్యత కనిపిస్తుంది. గత అసెంబ్లీకి గడువు 2019 ఏప్రిల్ వరకూ ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం 6 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లింది. 2018 డిసెంబరులో పార్టీ ఘన విజయం సాధించింది. మెజారిటీ టికెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇక్కడా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేట్లకే ఎక్కువ టికెట్లు కేటాయించింది. రిజర్వేషన్లను మార్చకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏకంగా మునిసిపల్ చట్టాన్నే సవరించింది. అయినా.. టీఆర్‌ఎస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.ఇకపోతే జిహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు కీలకాంశాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికీ సీమాంధ్రకు చెందిన వారిలో అత్యధికులు టిఆర్‌ఎస్‌తోనే ఉన్నారని స్పష్టమైంది. అయితే ఉత్తరాది నుంచి వలసవచ్చిన, దక్షిణ తెలంగాణకు చెందిన సెటిలర్స్ తీర్పు మాత్రం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉంది. సాప్ట్‌వేర్ రంగానికి చెందిన వాళ్ళల్లో అత్యధికులు అభివృద్ధికే జై కొడుతూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేసినట్లు ఈ ఫలితాలు రుజువు చేశాయి. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు పలికారు. అలాగే ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పట్టం కట్టారు. ఫలితంగానే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ భారీగా సీట్లు దక్కించుకుంది. ఈ ఏరియాల్లో స్థిరపడిన వారిలో రాయలసీమ, దక్షిణాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ తమను అక్కున చేర్చుకున్న టీఆర్‌ఎస్‌తోనే కలసి నడుస్తున్నారు. ఫలితంగా శేరిలింగంపల్లిలో అత్య ధిక సీట్లు రాగా.. కూకట్‌పల్లిని టీఆర్‌ఎస్ స్వీప్ చేసింది. ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రం బీజేపీకి జై కొట్టారు. ఈ కారణంగానే ఉత్తరాది వారు స్థిరపడిన గోషామహాల్, గన్‌ఫౌండ్రి, బేగంబజార్,
జియాగూడ, హిమాయత్ నగర్ తదితర డివిజన్లలో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. గతంతో పోలిస్తే ఈసారి టెకీలు అతి తక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారందరూ అభివృద్ధికి పట్టం కడుతూ అధికార పార్టీకి జై కొట్టారు. ఈ కారణంగానే ఐటీ జోన్‌లో ఉన్న డివిజన్లలో ఒక్క గచ్చిబౌలి మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా టీఆర్‌ఎస్ జెండా ఎగిరింది. సర్జికల్ స్టయ్రిక్స్ చేసేంత అవకాశం అధికారం మాత్రం రాకున్నా స్తానాల సంఖ్య ఏకంగా పదిరెట్ల పైన పెరగడమే గాక ఓట్ల శాతం కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇది నిస్సందేహంగా పాలక టిఆర్‌ఎస్‌కు ఒక మధ్యంతర హెచ్చరిక వంటిదే. దుబ్బాక ఉప ఎన్నిక పలితం కన్నా ఇది పెద్ద దెబ్బగా గుర్తించి పాలనా పరమైన రాజకీయమైన లోపాలు దిద్దుకోకపోతే టిఆర్‌ఎస్ నష్టపోతుంది. గత పర్యాయం కార్పొరేషన్ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి టిఆర్‌ఎస్ చాలా దెబ్బతిన్నది. కో ఆప్టెడ్ సభ్యులును కలుపుకున్నా మేయర్ పీఠం పొంద లేనంత తక్కువకు పడిపోయింది. ఈ రెండు పార్టీలతో పోలిస్తే మజ్లిస్ తన బలాన్ని దాదాపు నిబెట్టుకోగలిగింది. బిజెపి ప్రచారం చేసినట్టు మజ్లిస్ మేయర్ రాకపోయినా వచ్చినా నగరపాలనలో బలమైన పట్టు కొనసాగిస్తుంది. టిఆర్‌ఎస్ మజ్లిస్ మధ్య గతంలో వున్న అవగాహన మేయర్ డిప్యూటీ మేయర్ స్టాండిరగ్ కమిటీ వంటి వాటిలో కొనసాగుతుందా లేక ఇతరేతర ఉపాయాలు వ్యూహాలు అమలు చేస్తారా అన్నది ముందు ముందు తేలాలి. రెండు మాసాల వ్యవది వుందని మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు టిఆర్‌ఎస్ లో సాగుతున్న అంతర్గత మధనాన్ని చెబుతుంది. మజ్లిస్ నామకార్థంగా పోటీ పెట్టి టిఆర్‌ఎస్‌కు మెజార్టి వచ్చేలా చేయడం, డిప్యూటీ మేయర్ తీసుకోవడం,పదవీ కాలం పంచుకోవడం వంటి ఆప్షన్స్ వుంటాయి. అయితే పరోక్ష అవగాహనకే పాలక పక్షం మొగ్గుచూపొచ్చు. ఈ కాలంలో మరిన్నికో ఆప్షన్స్, లేదా పార్టీ మార్పులు జరిపిస్తారని కొందరంటున్నా ఈ ఫలితం తర్వాత వెంటనే అలాటి రాజకీయ దుస్సాహసాలు చేయకపోవచ్చు.