కొత్త రోమింగ్‌ ప్లాన్‌ ఇది

కొత్తగా ప్రవేశపెట్టి రోమింగ్‌ ప్లాన్‌కు సంబంధించి 152 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. దీనిలో 6 వేల సెకన్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కి, మరో 6వేల సెకన్లు ఇతర నెట్‌వర్కులకు వాడుకోవచ్చు. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ ఏ ఫోన్‌కైనా రోమింగ్‌ చార్జిలు ఉండవు. 3 వేల సెకన్ల వరకు బిఎస్‌ఎన్‌ఎల్‌ వీడియో కాల్స్‌ ఉపయోగించుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో 50, ఇతర రాష్ట్రాల్లో 50 వరకు ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 50 ఎంబి వరకు ఉచితంగా డేటా వినియోగించుకోవచ్చు. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పూర్తిగా ఉచితం. ఇది 90 రోజులే పని చేస్తుంది. కాలపరిమితి పెంచుకోవడానికి 152 రూపాయల రీచార్జి చేయాల్సి ఉంటుంది. 6 వేల సెకన్లు దాటిపోతే బిఎస్‌ఎన్‌ఎల్‌కు 1.20పైసలు, ఇతర నెట్‌వర్కులకు 1.50 పైసలు రోమింగ్‌ చార్జిలు పడుతాయి.