కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒప్పటి వరకూ 11 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మిగిలిఉన్న 17రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్లలెక్కింపు రాత్రి 7గంటల వరకూ కొనసాగే అవకాశముంది. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ అధిక్యం లభించింది. ప్రణబ్‌కు 117 ఓట్లు రాగా, ఎన్డీఏ అభ్యర్థి సంగ్మాకు 103ఓట్లు లభించాయి. 3ఓట్ల చెల్లలేదు.