కొనసాగుతున్న లేపాక్షి రెండో రోజు పర్యాటక ఉత్సవాలు
లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షిలోరెండో రోజు పర్యాటక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గామాత ప్రత్యేక ఆలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లేపాక్షి ఆలయ నిర్మాత కర్త విరూపణ్ణ విగ్రహాన్ని మంత్రులు వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డిలు ఆవిష్కరించారు. విగ్రహాం ఏర్పాటు ద్వారా లేపాక్షి ఆలయం నిర్మాణం కోసం విరూపణ్ణ చేసిన కృషి అందరికీ తెలుస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పాఠశాల విద్యార్థులకు 3కెరన్ నిర్వహించారు., కళాకారుల ప్రదర్శనలు రెండో రోజూ కొనసాగుతున్నాయి.



