కొలిజీయం సిఫార్సుల మేరకు 9 మంది జడ్జిల నిమామకం


ఉత్తర్వులపై సంతకం చేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసిన 9 మంది జడ్జిల నిమామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి 9 మంది కొత్త జడ్జీల నిమామక ఉత్తర్వులపై గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. కాగా సుప్రీంకోర్టు కొత్త జడ్జిలపై కేంద్రం గెజిట్‌ను విడుదల చేయనుంది.సుప్రీంకోర్టు కొత్త జడ్జిలుగా జస్టిస్‌ హిమ కోహ్లి, బీవీ నాగరత్న, జస్టిస్‌ బేల త్రివేది, జస్టిస్‌ జెకె. మహేశ్వరి, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్‌, జస్టిస్‌ నాగార్జున ఉన్నారు. సుప్రీంకోర్టులో హిమా కోహ్లి బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణ సీజేగా మరొకరు రానున్నారు. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్‌ నుంచి ఒకరు ఉన్నారు.