కోక్రాఝర్‌లో చెలరేగిన హింస.. నలుగురి మృతి

గౌహతి: అసోంలో మళ్లీ హింస చెలరేగింది. కోక్రాఝర్‌ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు, మృతుల్లో ఓ చిన్నారికూడా ఉంది. దీంతో గత వారం రోజు నుంచి చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. ఉద్రిక్తతల నేపథ్యంలో కోక్రాఝర్‌ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు డీజీపీ జయంత్‌నారయణ్‌ చౌదురి తెలియజేశారు. మరోవైపు బోడో టెర్రిటోరియల్‌ కౌన్సిల్‌ సభ్యుడు మనోకుమార్‌ బ్రహ్మోను పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి అయుధాలను, 60 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నారు.